సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం డిఎన్నార్ కళాశాల గన్నాబత్తుల క్రీడా మైదానంలో పశ్చిమ గోదావరి జిల్లా స్పోర్ట్స్ పెడరేషన్ ఆఫ్ డెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ రాష్ట్రస్థాయి బధిరుల (మూగ చెముడు) టీ20 క్రికెట్ పోటీలను నేడు, బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. బధిరులు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, క్రీడల్లో రాణిస్తే ఎన్నో ఉద్యోగ అవకాశాలు న్నాయని, మానసిక ఆందోళన చెందకూడదని అన్నారు. ఇటువంటి పోటీలను భీమవరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ తరపున రంగసాయి, భూపతిరాజు మురళీ కృష్ణంరాజు, సీహెచ్ తాతారావు మాట్లాడుతూ.. 9 జిల్లాల నుంచి 50 మంది బధిర క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారని, జోన్ -1,2,3 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు) విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయని, గురువారం ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు.
