సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 31 వ తేదీన భీమవరం లో శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఎమ్మెల్సీల సదస్సు నిర్వహిస్తున్నారు, దీనికోసం అన్ని ఆధునిక హంగులు ఉన్న విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ఆవరణను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సదస్సు కు సంబంధించిన ఏర్పా ట్లపై కొయ్యే మోషేను రాజు స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాష్ తో ఇప్పటికే సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 58 మంది ఎమ్మెల్సీలు సదస్సు కు హాజరవుతారని. రాష్ట్రస్థాయి సదస్సు నేపథ్యంలో పట్టణంలో ప్రతిష్టాకర ఏర్పాట్లు , బందోబస్తువారి భద్రత , స్థానికంగా ఉన్న చర్చి , మసీదు, ఆలయాల సందర్శ న ఏర్పా ట్లు చేయాలని చైర్మ న్ మోషేన్‌రాజు అధికారులకు ఆదేశాలిచ్చారు. మం డలి విధివిధానాలు, సభలో సభ్యు లు వ్యవహరిం చాల్సిన తీరు, తదితర అంశాలపై సదస్సు లో సభ్యు లకు అవగాహన కల్పిస్తామన్నారు.
