సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రైవేట్ లే అవుట్లలో ఐదు శాతం ప్రభుత్వానికి కేటాయించాలంటూ ఇచ్చిన జి.ఓ. నెంబర్ 15 ను రద్దు చేసిన ప్రభుత్వం గతంలో ప్రైవేటు లే అవుట్లకు సంబంధించి జారీ చేసిన జి.ఓ. ను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో ప్రభుత్వం జిఓ నెంబర్ 145 ను జారీచేసింది. దాని ప్రకారం వారు ఐదు శాతం స్థలాన్ని రిజర్వ్ చేస్తేనే కాని లేఅవుట్ కు అనుమతి ఇవ్వని పరిస్థితి ఇప్పటివరకు ఉంది. అయితే వివిధ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, ప్రజల నుంచి ఆ నిబంధనను సవరించాలని రీ ఎగ్జామిన్ చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని పరిశీలించిన మీదట ఆ జిఓను రద్దు చేస్తూ ఈరోజు బుధవారం అనగా (25-01-23) న జిఓ ఎంఎస్ నెంబర్ 13 ను జారీచేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. భీమవరంలో ఇది వెంటనే అమలులోకి వచ్చిందని కమిషనర్ తెలిపారు.
