సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంపట్టణం ప్రధాన సెంటర్ ప్రకాశం చౌక్ వద్ద ఈ రోజు , బుధవారం ఉదయం భీమవరం మెయిన్ రోడ్డు లో కోట్లాది రూపాయల ఖర్చుతో ఆధునిక హంగులతో పునర్ నిర్మించిన రూపాంతర దేవాలయం ( చర్చ్) ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ , కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, క్రైస్తవ పెద్దలు పరదేశిబాబు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మరియు భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) , మెంటే పార్ధ సారధి, ఉద్దరాజు విశ్వనాధ రాజు మరియు వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు, సంఘ పెద్దలు మరియు వివిధ సంఘాలకు చెందిన క్రైస్తవులు పెద్దఎత్తున ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ప్రముఖులు హాజరు అవుతున్న నేపథ్యంలో ఉదయం 7గంటల నుండి 10గంటల వరకు ప్రధాన పీ.పీ రోడ్ ప్రధాన రహదారి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *