సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:గ్రామాలను అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం ఎల్ విఎన్ పురం – అనాకోడేరు గ్రామంలో రూ 4 కోట్ల 7 లక్షలతో రోడ్డు పనులకు నేడు, శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. 5.2 కిమీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాల్లో రోడ్డు అనుసంధానం మౌలిక సదుపాయాల కల్పన, రైతు సంక్షేమం ద్వారా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, సర్పంచ్, సొసైటీ బ్యాంక్ చైర్మన్, డైరెక్టర్లు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *