సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గం అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని,ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. అయన నేడు, గురువారం భీమవరం పట్టణంలోని 5 వార్డులలో సుమారు రూ కోటి 2 లక్షల నిధులు మంజూరు అయ్యాయని.,సీసీ రోడ్లు, డ్రెయినేజీలకు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మితో కలసి శంకుస్థాపనలు చేశారు. ముందుగా 34వ వార్డులో రూ 19 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్, 35వ వార్డు వంశీకృష్ణ నగర్లో 29.02 లక్షలతో సీసీ డ్రైన్, 36వ వార్డులో రూ 10 లక్షలతో సీసీ రోడ్డు, 37వ వార్డులో రూ 34 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్, 39వ వార్డు బైపాస్ రోడ్డులో రూ 10.10 లక్షలతో బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని అన్ని వార్డులోను సీసీ రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ధి చేస్తున్నామని, మోడరన్ నియోజక వర్గంగా భీమవరాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు, వార్డు పెద్దలు, అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
