సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు అనగా (09-04-2024 }తేదీన భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో ఉదయం 8 గంటలకు క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా 2024 పంచాంగ శ్రావణం ఆలయ ప్రధానార్చకులు వేదపండితులుచే నిర్వహించబడును. అనంతరం భక్తులకు శ్రీ అమ్మవారి ప్రసాదం,పసుపు,కుంకుమ,పంచాంగాలు వితరణ జరుపబడును అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. స్థానిక శ్రీ ఉమాభీమేశ్వర స్వామి దేవాలయంలో రేపు ఉదయం 9గంటల నుండి తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను కోలాహలంగా జరుపుతున్నట్లు రంగసాయి తెలిపారు. ఇక, భీమవరం శ్రీ మహిషాసుర మర్ధిని భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామరాజ భూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో శ్రీక్రోధి నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు నడింపల్లి వెంకట్రామరాజు, రాయప్రోలు భగవాన్, భట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. రేపు సాయంత్రం 6.30 గంటలకు కవికువలయాలు బ్రహ్మశ్రీ కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ, బ్రహ్మశ్రీ కడిమళ్ళ వరప్రసాద్ గురు సహస్తావధారి, ఇందుకూరి వెంకట లక్ష్మీపతిరాజు, సరికొండ నరసింహరాజు, రసరాజు, కోట లక్ష్మి నరసింహ సహస్రావధాని, చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి, రామకృష్ణంరాజు, జ్యోతిరాజ్ భిశెట్టి లచే కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గునుపూడి శ్రీ ఆదిలక్ష్మి.. అమ్మవారి దేవాలయంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉగాది జాతర మేళతాళాలతో గ్రామా ఉరేగింపులతో మధ్యాహ్నం అన్నసమారాధన లతో ఘనంగా నిర్వహించనున్నారు.
