సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల, 3 వ తేదీ అనగా ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు మధ్యాహ్నం గం.3: 20ని.ల నుండీ సాయంత్రం గం.6:47ని.ల వరకు కేతుగ్రస్త చంద్ర గ్రహణం సంభవించుచున్నదని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పురాధీశ్వరి మరియు పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయాలలో రేపు అనగా మంగళవారం మార్చి 3వ తేదీన ఉదయం 9 గంటల నుండి దేవాలయాలు మూసివేస్తునారు. తదుపరి 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తారు. అయితే కీలకమైన విషయం ఏమిటంటే.. రేపు.. మంగళవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి పౌర్ణమి రోజు జరిగే విశేష చండీహోమం ఆ రోజు ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి 9 గంటలు లోపుగా పూర్తి చేయడం జరుగుతుంది భక్తులు గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *