సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టూ టౌన్‌లోని బీసీ కాలనీ సమీపంలో గత శుక్రవారం జరిగిన రౌడీ షీటర్ రౌతుల ఏసు (32) దారుణ హత్యకు పట్టణంలో సంచలనం రేపింది. సీఐ కృష్ణకుమార్ ,ఎస్పీ రవి ప్రకాష్, కూడా మృతదేహాన్ని పరిశీలించారు. అయితే హత్య ఎందుకు జరిగిందో సస్పెన్సు కొనసాగింది. తాజాగా నిందితులు అంత యువకులేనని కొందరు పోలిసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీస్ సమాచారం ప్రకారం.. బలుసుమూడికి చెందిన ఏసు(32) అతని స్నేహితులైన మరో నలుగురితో కలిసి బైక్‌లపై ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఈల వేసుకుంటూ ఏసును గేలి చేశారు. దీంతో ఆ ముగ్గురి కధ తెలుస్తానంటూ మిగిలిన నలుగురు స్నేహితులను అక్కడే వదిలి ఏసు వారి వాహనాన్ని వెంబడిస్తూ, బలుసుమూడి బీసీ కాలనీ సమీపానికి వెళ్లేసరికి ముందస్తు పధకం ప్రకారం అక్కడే ఉన్న మరికొందరు ఏసు కళ్లలో కారం కొట్టి కర్రలు, కత్తి ఇటుకలతో దాడి చేశారు. కిందపడిన అతని తలపై బండరాయితో మోది హత్య చేసి పరారయ్యారు. ఏసు ఎంతసేపటికి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు ఘటన స్థలంలోకి వెళ్లగా రక్తపు మడుగులో వున్న ఏసును చూసి దిగ్బ్రాంతి చెందారు. . సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఏసుకు నిందితులకు గతంలో పాత గొడవలున్నట్టు ముందస్తు ప్లాన్ ప్రకారం.. హత్య చేసినట్టు సమాచారం.. మరోవైపు ఏసు, అతని సోదరుడు రఘుపై భీమవరం పోలీస్ స్టేషన్లో పలు కేసులున్నాయి. ఇద్దరిపై రౌడీ షీట్ ఉంది. ఇటీవల భీమవరం సీసీఎస్ ఎస్ఐ సంపత్‌తోపాటు ఒక కేసులో రఘు రిమాండ్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు.
