సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వాస్తవ్యుడు బ్రిటీష్ దేశంలో ప్రజా ప్రతినిధిగా .. ప్రస్తుత సెంట్రల్ లండన్ లోని కెన్సింగ్టన్ అండ్ చేస్లా డిప్యూటీ మేయర్ ఆరేటి ఉదయ్,ఇటీవల భీమవరం లో పలు సంస్థలతో ఘన సన్మానాలు అందుకొంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు, ఆదివారం భీమవరం సరోవర్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా వారిచే ప్రారంభించిన మై స్టాంప్స్ కేటగిరి నుంచి మార్నింగ్ కాఫీ క్లబ్ లోగో తో కూడిన స్టాంప్ ను సెంట్రల్ లండన్ లోని కెన్సింగ్టన్ అండ్ చేస్లా డిప్యూటీ మేయర్ ఆరేటి ఉదయ్, స్థానిక బీజేపీ ఎంపీ పాకా సత్యనారాయణ సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ ఉదయ్ మాట్లాడుతూ సమాజంలో సామాజిక సేవ చేయడంతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించలేదని, మనమే ఐక్యత లేక వాళ్ళచే పాలించేలా చేసుకున్నామన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ కాపీ అనేది ఒక వ్యసనమని అటువంటి పేరుతొ సమాజం కోసం 4 ఏళ్ళ క్రితం క్లబ్ గా ఏర్పడి ఎన్నో మంచి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఇద్దరు ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్ధిక సహకారాన్ని అందించారు. డిప్యూటీ మేయర్ ఉదయ్, ఎంపీ సత్యనారాయణ లను ఘనంగా సత్కరించారు. మార్నింగ్ కాఫీ క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, పీఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు, కారుమూరి సత్యనారాయణ,కురిశేట్టి కాశి, కురిశేటి నాని,లు తదితరులు పాలుగొన్నారు.
