సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులు ఎక్కువగా రాజీ చేయుటకు తీసుకోవలసిన చర్యలు గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు భీమవరం పోక్సో కోర్టు న్యాయమూర్తి M.A.సోమశేఖర్ స్థానిక న్యాయమూర్తులు, భీమవరం కోర్టుల పరిధిలో ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, సబ్ ఇన్స్పెక్టర్ లు, పోలీసు సిబ్బంది తో నేడు, బుధవారం భీమవరం లోని జిల్లా పోక్సో కోర్టు లో సమావేశం నిర్వహించారు. క్షణికావేశంలో చేసే రాజీ కాదగిన నేరాలు, చాలా కాలంగా నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగులో ఉండి ఫిర్యాది రాజీకి వచ్చిన కేసులు, దొంగతనం కేసులు,వరకట్న వేధింపు కేసులు, గృహహింస కేసులు, మోటార్ యాక్సిడెంట్ కేసులు మొదలగు కేసులు ఎక్కువ పెండింగులో ఉన్నందున వాటి రాజీకి పోలిసులు కృషి చేసి సహకరించాలని న్యాయమూర్తి కోరారు. పోలీసులు వారికి ఉన్న సందేహాలను, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) B.అప్పల స్వామి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) G. సురేష్ బాబు, 2వ అదనపు మొదటి తరగతి మేజిస్ట్రేట్ D. ధనరాజు, భీమవరం వన్ టౌన్, టూ టౌన్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు, వీరవాసరం పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
