సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: దివంగత వంగవీటి మోహన రంగా 32వ వర్ధంతి నేపథ్యంలో భీమవరం డి.ఎన్.ఆర్ కాలేజ్ రోడ్డు లో ఆయన విగ్రహానికి కాపు సంఘ నేతలు, జనసేన పార్టీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగా జోహార్.. అంటూ నాయకులు అభిమానులు నినాదాలు చేశారు ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ..మోహన రంగా మరణించి 32 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అని ఆయన ఒక డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందారనీ ఆయన ఆశయాలు మేరకు కాపు సంక్షేమ సేన ఎప్పుడు పనిచేస్తుందని అన్నారు. పట్టణ జనసేన అధ్యక్షులు శ్రీ చేనమల చంద్రశేఖర్ మాట్లాడుతూ… కాపు సంక్షేమ సేన ఏప్పుడు గొప్ప గొప్ప ఆశయాలతో ముందుకు వెళుతుందని పేద బలహీన వర్గాల వారు ను బలోపేతం చేయడానికి పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తుందని అన్నారు. మాగాపు ప్రసాద్ మాట్లాడుతూ..తాము పవన్ కళ్యాణ్ వెంట నడుస్తామన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 32వ వర్ధంతి కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడం లో కాపు సంక్షేమ సేన ముందుంటుందని అన్నారు.
