సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, పవిత్ర శ్రావణ శుక్రవారం సం దర్భం గా వరలక్ష్మి వ్రతాన్ని భీమవరం పట్టణంలో మహిళలు ప్రతి ఇంట నిర్వహించుకొంటున్నారు. శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం తో సహా అన్ని దేవి ఆలయాలు దేవాలయాలు కూడా మహిళలతో కళకళ లడాయి. అయితే గత గురువారం మధ్యాహ్నం నుండి అనూహ్యంగా పెరిగిపోయిన పూజాసామగ్రి భారీ ధరలుతో పూజ ఘనంగా చేసుకొందామని అనుకున్న సాధారణ గృహిణులు ఆందోళన చెందారు. ఆదివారం బజారు సెంటర్, కొత్త బస్సు స్టాండ్ సెంటర్ లలో గత సాయంత్రం నుండి పూజ సామాగ్రి కొనుగోళ్లు మహిళలు , ఆబాల గోపాలం, వర్తకుల సందడితో ట్రాఫిక్ పలు సార్లు నిలచిపోయింది. డిమాండ్ బాగా పెరిగిపోవడం తో పూలు, పండ్లు తదితర సామగ్రి అకస్మాత్తుగా మరింత భారీగా ధరలు పెరిగిపోయాయి. 60 రూపాయలకు అమ్ముతున్న డజను అరటి పళ్ళు 120 రూపాయలకు, కేవలం 20 గ్రాముల పువ్వులు 50 రూపాయలు..లక్ష్మీదేవి పూజకు ఎక్కువగా చామంతులు వినియోగిస్తుంటారు. కేజీ చామంతులు అయితే రూ.600కు పైగానే ధర పలికింది. కేజీ కనకంబరాలు, రూ.2వేలు, కేజీ మల్లెలు రూ.1600, మూర మల్లెలు 80 రూపాయలు చిట్టిగులాబీ రూ.300కు చేరుకున్నా యి. తమలపాకులు మోద రూ.50కు చేరింది. కొబ్బరి కాయలు కాస్త 15 – 25 రూపాయలు కు అందుబాటులో ఉన్నాయి.
