సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, పవిత్ర శ్రావణ శుక్రవారం సం దర్భం గా వరలక్ష్మి వ్రతాన్ని భీమవరం పట్టణంలో మహిళలు ప్రతి ఇంట నిర్వహించుకొంటున్నారు. శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం తో సహా అన్ని దేవి ఆలయాలు దేవాలయాలు కూడా మహిళలతో కళకళ లడాయి. అయితే గత గురువారం మధ్యాహ్నం నుండి అనూహ్యంగా పెరిగిపోయిన పూజాసామగ్రి భారీ ధరలుతో పూజ ఘనంగా చేసుకొందామని అనుకున్న సాధారణ గృహిణులు ఆందోళన చెందారు. ఆదివారం బజారు సెంటర్, కొత్త బస్సు స్టాండ్ సెంటర్ లలో గత సాయంత్రం నుండి పూజ సామాగ్రి కొనుగోళ్లు మహిళలు , ఆబాల గోపాలం, వర్తకుల సందడితో ట్రాఫిక్ పలు సార్లు నిలచిపోయింది. డిమాండ్ బాగా పెరిగిపోవడం తో పూలు, పండ్లు తదితర సామగ్రి అకస్మాత్తుగా మరింత భారీగా ధరలు పెరిగిపోయాయి. 60 రూపాయలకు అమ్ముతున్న డజను అరటి పళ్ళు 100 రూపాయలకు, కేవలం 20 గ్రాముల పువ్వులు 50 రూపాయలు..లక్ష్మీదేవి పూజకు ఎక్కువగా చామంతులు వినియోగిస్తుంటారు. కేజీ చామంతులు అయితే రూ.600కు పైగానే ధర పలికింది. కనకంబరాలు ఒక్క మురా దండ 150 రూపాయలు అమ్మకాలు కేజీ మల్లెలు రూ.2000, మూర మల్లెలు 100 రూపాయలు కేజీ చిట్టిగులాబీ రూ.350కు చేరుకున్నాయి తమలపాకులు మోద రూ.50కు చేరింది. కొబ్బరి కాయలు అయితే చిన్నవి 30 రూపాయలు పెద్దవి 40 రూపాయలు చప్పున అమ్మకాలు జరిగాయి.
