సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు బుధవారం ‘ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం’ సందర్భముగా భీమవరంలోని దుర్గాపురం ఏరియాలో మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు వరల్డ్ ఓరల్ హెల్త్ డే దినోత్సవాన్ని ఆరోగ్య సిబ్బంది నిర్వహించారు. స్థానిక ప్రజలకు విద్యార్థులకు పళ్ళు నోరు శుభ్రత గురించి, శుభ్రత లేని దాని వలన వచ్చే అనారోగ్యాల గురించి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలను చైతన్య పరచడానికి పురవీధుల్లో ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో- డాక్టర్ .డి .మహేశ్వర రావు ,బిపిఎమ్ఓ – సిహెచ్. ధనలక్ష్మి , డిపిఓ – పి. సురేష్ ,డెంటిస్ట్ డాక్టర్. అబ్దుల్ వహీద్ మరియు స్కూల్ సిబ్బంది మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *