సిగ్మా తెలుగు డాట్ కామ్, న్యూస్: మరో 6 రోజులు ఉందనగా భీమవరంలో దీపావళి బాణాసంచా షాపుల సందడి స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్ లో ప్రారంభమయింది. దీపావళి నాటికీ సుమారు 50 షాపులు ఏర్పాటు చేస్తారని ఒక అంచనా . ప్రభుత్వ అధికారులనిబంధనలు, కరోనా నిబంధనలు మేరకు షాపులు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 3 దశాబ్దాలు పైగా క్రమం తప్పకుండ ఏర్పాటు చేస్తున్న ‘షాప్ నెంబర్ 5 లో “వరుణా సూపర్ బజార్” వారి దీపావళి బాణాసంచా షాప్ ను రాజకీయ, వ్యాపార ప్రముఖులు మెంటే పార్ధసారధి, పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అత్యంత నాణ్యత కలిగి ఉన్న బ్రాండెడ్ బాణాసంచా క్రాకర్స్, టపాసులు ను గతంలో లాగానే ప్రజలకు అందుబాటు లో హోల్ సేల్ ధరలకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈసారి సరికొత్త విభిన్న తరహా బాణాసంచా వైరటీలు వచ్చాయని, వరుణ సూపర్ బజార్ బాణాసంచా ప్రజల నమ్మకానికి బ్రాండ్ అని, వారి ప్రోత్సహానికి కృతజ్ఞలు తెలుపుతున్నానన్నారు. సురక్షితమైన జాగ్రత్తలు తీసుకోని ప్రజలు దీపావళి పండుగ జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు

