సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం లో సుమారు 3 వారలు తరువాత నేడు, శుక్రవారం వర్షం కమ్మటి మట్టివాసనతో ప్రజలను పలకరించింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాలు విస్తరించకపోవడంతో వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి, అందులోను గత 3 వారాలుగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వర్షం ముఖం చాటేసింది. అయితే నిన్న గురువారం నుండి నేడు, శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకొంది. నిన్న పాలకొల్లు పరిసర ప్రాంతాలలో వర్షం దంచి కొట్టింది. ఈ వాళ్ళ భీమవరం పట్టణం అంత మధ్యాహ్నం నుండి చలిగాలులతో ముసురు కమ్ముకొని వర్షం పలకరించడంతో ప్రజలు ఇటీవల వరుసగా నిప్పులు చెరుగుతున్న ఎండల భారీ నుండి కాస్త ఉపశమించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *