సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు భీమవరం పట్టణంలో గత 4రోజులుగా ఏకబిగిగా కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన ముంపు ప్రాంతాలని సందర్శించి అక్కడ ప్రజల ఇబ్బందులు పరిష్కారానికి సమీక్ష జరిపారు, అక్కడ నివసిస్తున్న ప్రజలతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ మున్సిపల్ కమిషనర్ వాటర్ వర్క్ సిబ్బంది కోళ్ల నాగేశ్వరావు చనమల్ల చంద్రశేఖర్ ఎద్దు ఏసు పాదం, బాపిరాజు, తోట సురేష్ గన్నాబత్తుల సతీష్ కమ్మిల వెంకటేశ్వరరావు తదితర కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
