సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, స్థానిక మెంటేవారి తోటలోని సుందరయ్య భవనంలోని అల్లూరి సీతారామరాజు వైద్య సేవ సహాయ కేంద్రంలో వసుధ ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం నేడు, శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. గత 26 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో 45 శాఖల ద్వారా విద్యా వైద్య ఉపాధి సేవా, కార్యక్రమాలను వసుధ ఫౌండేషన్ నిర్వహిస్తుందన్నారు. వృద్ధులు, అనాధలు, వికలాంగులు సంక్షేమం కోసం ఆశ్రమాలకు 400 సేవా సంస్థల ద్వారా సహాయం అందిస్తున్నారు. 500 విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు,మంచినీరు సౌకర్యం కల్పించిందన్నారు. వసుధ ఫౌండేషన్ చైర్మన్, మంతెన వెంకటరామరాజు జన్మదినం రోజున వసుధ ఫౌండేషన్ ప్రారంభం అయ్యిందన్నారు. ఈసందర్భంగా ఈ రోజు వైద్య సహాయ కేంద్రంనకు వచ్చిన వారికి పండ్లు ,రొట్టెలు , బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు
