సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో రేపు గురువారం ఏసుప్రభు జన్మదినం క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అని ప్రాంతాలలో చర్చలను అందమైన అలంకరణలు, మినీ సెట్స్, లైటింగ్ కాంతులతో నింపేశారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లోని జిల్లా లోనే అతిపెద్ద చర్చ్ రూపాంత దేవాలయంలో, సెయింట్ మేరీస్ , బేతని, గునుపూడి చర్చిలల్తో పాటు పలు ప్రధాన చర్చలలో ఇప్పటికే బాలలు ప్రదర్శించే రారాజు, క్రీస్తు జననం నాటికలు,దేవుని సోత్రాలు, అభినయ నృత్యాలు, శాంతా క్లాస్‌ ప్రదర్శనలు, సంగీత ఆర్కెస్ట్రా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నేటి రాత్రి నుండి రేపు గురువారం తెల్లవారు జామువరకు క్రిస్మస్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు, రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ నేతలు తోట సీతారామ లక్ష్మి, జనసేన చినబాబు తదితరులు ఇప్పటికే స్థానిక క్రైస్తవ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రభువు జన్మదినవేడుకలను పలు చోట్ల ఆహ్వానించారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *