సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్ : భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచా రామ క్షేత్రంలో నేడు, సోమవారం దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి దేవస్థానం లో ఉన్న శ్రీ పార్వతి అమ్మవార్ని మొదటి రోజుగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గా అలంకరించగా, భక్తులు భవాని మాలదారులు పెద్ద సంఖ్యలో శ్రీ స్వామి వారితో పాటు , శ్రీ పార్వతి, శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవార్లను దర్శించుకొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేసారు. భక్తులకు తగు ఏర్పాట్లను ఆలయం ధర్మకర్తలు మరియు కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. భీమవరం పురాధీస్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి తో పాటు పలు ప్రాంతాలలో దేవి ఆలయాలలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని బెంగాలీలు, జైన్స్ కాళికామాత , శ్రీ దేవి విగ్రహ ప్రతిమలను ఏర్పాటు చేసిన పందిళ్ళలో వేడుకలు 10 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. త్యాగరాజ భవనంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కి ఎప్పటి లాగే స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం వారు మంచి సెటింగులతో, ప్రత్యేక అలంకరణతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
