సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా వేడుకల నేపథ్యంలో భీమవరం పరిధిలో పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే అంజిబాబు శ్రీ దేవి ఆలయాలను , ఉత్సవ పందిళ్లల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పలు కార్యక్రమాలలో ఉండి ఎమ్మెల్యే రఘురామా , జనసేన చినబాబు కూడా పాల్గొన్నారు. స్థానిక అడ్డా వంతెన దగ్గర అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీనివాస థియేటర్ వద్ద శ్రీ కామాక్షమ్మ వారి దేవాలయం, భీమవరం సుంకర పద్దయ్య వీధిలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలోను, 39వ వార్డు దుర్గాపురం అప్పలరాజు గారి వీధిలోని కనకదుర్గ దేవి అమ్మవారి 10వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవం, గొల్లవానితిప్ప రోడ్డులోని శ్రీ దుర్గాదేవి అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మన సంప్రదాయ పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, దసరా ఉత్సవాలను అన్ని దేవాలయాల్లో అమ్మవార్లకు అలంకరణలతో ఎంతో వైభవంగా నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు శ్రీ అమ్మవార్ల ఆశీస్సులు భీమవరం ప్రజలందరికీ ఉండాలని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. కార్యక్రమంల లో టీడీపీ కోళ్ల నాగేశ్వర్రావు, జనసేన చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, లంకి శ్రీనివాస్, మచ్చకర్ల శివ, మాణిక్యాలరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *