సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో వాడవాడలా శ్రీ గణేష్ నవరాత్రులు పంచమ రాత్రులు ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీ గణపతి విగ్రహాల నిమజ్జనాల తరువాత అన్నసమారాధన కోలాహలాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు గురువారం భీమవరం 24వ వార్డు చిన్న అప్పారావు తోటలో శివగణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి 17వ వార్షిక మహోత్సవంలోమరియు 26వ వార్డు గంగానమ్మ గుడి ఎదురుగా గనిశెట్టి వారి వీధిలో యువ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో మరియు 28వ వార్డు వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలను స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. మహా నివేదనకు పూజలు చేసి హారతులు ఇచ్చారు. సంప్రదాయ బద్దంగా యూత్ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భీమవరం 20వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ పూరిగుడి దగ్గర శ్రీ వినాయక చవితి అన్నసమారాధన ను స్థానిక యూత్ ఆధ్వర్యంలో గన్నాబత్తుల శ్రీనివాస్ సహకారంతో నిర్వహించారు.
