సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో నేడు, సోమవారం వృదులకు వికలాంగులకు, రోగులకు పెన్షన్ పంపిణి కార్యక్రమం లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. నేటి ఉదయం 6:00 గంటల నుండి సచివాలయ సిబ్బంది సహకారంతో పింఛన్ పంపిణి కార్యక్రమం ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యే అంజిబాబు , జనసేన, టీడీపీ స్థానిక నేతలతో కలసి పింఛన్ పంపిణి కార్యక్రమం లో భాగంగా భీమవరం టౌన్ లోని 26, 37, 38, 6 వ వార్డులు తో పాటు వీరవాసరం బొప్పనపల్లి, మత్స్యపురి , తుందురు, బేతపూడి, తాడేరు , గునుపూడి, ప్రాంతాలలో స్వయంగా పింఛను దారుల ఇండ్లకు వెళ్లి పింఛను లు అందజేశారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. తమ కూటమి ఇచ్చిన హామీ మేరకు ఇకపై నెల నెల 4 వేలు పింఛను ఇవ్వడంతో పాటు గత 3 నెలలుగా నెలకు 1000 రూపాయలు కలపి మొత్తం ఈసారి 7000 చప్పున లబ్ధిదారుల ఇండ్లకే వచ్చి పింఛన్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే సూపర్ సిక్స్ హామీలు కూడా త్వరలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఒక పండుగలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, వార్డ్ ఇంచార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *