సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి బరిలో దిగిన బాలకృష్ణ వీరసింహారెడ్డి ,చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య‘ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఇప్పటికే ఈ 2చిత్రాలు 100 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లో చేరిపోయి తెలుగు సినిమా స్టామినా మరోసారి దేశానికీ చాటాయి. అయితే ఎక్కవ థియేటర్స్ ఉన్న కారణంగా,చిరంజీవి, రవితేజాల కాంబినేషన్ అదనపు బోనస్ కావడం తో వాల్తేర్ వీరయ్య కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ టచ్ ఉన్న మాస్ పాత్ర పడితే చిరంజీవి స్టామినా అంటే ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించారు. ఇక ఈ చిత్రాలు రెండు భీమవరంలో భారీ కలెక్షన్స్ దిశగా దూసుకొనిపోతున్నాయి. గత 7 రోజులలో బాలకృష్ణ సినిమాలలో రికార్డు స్థాయిలో వీర సింహారెడ్డి సుమారు 60 లక్షలు గ్రాస్ వసూలు చెయ్యగా, చిరంజీవి వాల్తేర్ వీరయ్య అయితే 81 లక్షల గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. ఇంకా 2 పండగ సినిమాలు మంచి దూకుడుగానే కలెక్షన్స్ వసూళ్లు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *