సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం జర్నలిస్ట్ డే సందర్భముగా పలు సేవ కార్యక్రమాలలో ముందుండే వాసవి క్లబ్ గునుపూడి, భీమవరం వారిచే పట్టణంలోని పలువురు సీనియర్ జర్నలిస్ట్ లకు కార్యాలయాలకు వెళ్లి వారి సేవలకు అభినందలు తెలియజేస్తూ సన్మానాలు నిర్వహించడం జరిగింది. ఈనేపథ్యంలో సుమారు 3 దశాబ్దాలుగా భీమవరం లో సిగ్మా న్యూస్ రిపోర్టర్ గా రాణిస్తున్న సిగ్మా’ ప్రసాద్ కు వాసవి క్లబ్ గునుపూడి సంఘ్ సభ్యులు స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులోని వారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికీ నిబద్దతతో కూడిన తాజా తాజా సమాచారం అందిస్తున్న’ సిగ్మాతెలుగు డాట్, ఇన్ .. కార్యాలయంలో సన్మానించి జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు తెలియజెయ్యడం జరిగింది.
