సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణం లో టౌన్ రైల్వే స్టేషన్ నుండి డబ్లింగ్ పనులు మెంటే వారి తోట మీదుగా టర్నల్స్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నా విషయం స్థానిక ప్రజలకు విదితమే. అయితే కీలకమైన డబ్లింగ్ పనులు నిమిత్తం మెంటే వారి తోట నుండి 3 టౌన్ లోని నర్సయ్య అగ్రహారాన్ని కలుపుతూ వెళ్లే బైపాస్ రోడ్డులో గల రైల్వే గేట్ ను ఈనెల 10వ తేదీ 8 గంటల నుండి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. కావున బైపాస్ రోడ్డులో ప్రయాణం చేసే స్థానికులు, దూరప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు ఇది గమనించి పట్టణం లోని మధ్య నుండి వెళ్లే పీపీ రోడ్డు ద్వారానే తమ ప్రయాణాలు చెయ్యవలసి ఉంది.
