సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో కార్గిల్ విజయ దివాస్ కాగడాల ర్యాలీని నేటి శుక్రవారం ఉదయం 1టౌన్ లోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర నుండి 2 టౌన్ లోని దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వరకు బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు మేరకు బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. కాగడాల ర్యాలీని జనసేన ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా కార్గిల్ విజయం భారతదేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని, ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.బిజెపి రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ పాక సత్యనారాయణ మాట్లాడుతూ.. . దాదాపు 60 రోజులపాటూ జరిగిన కార్గిల్ యుద్ధంలో ఇరుదేశాల సైనికులు చాలామంది చనిపోయారని, 527 మంది భారత సైనికులు అమరులయ్యారని, 1500 మంది పైగా గాయపడ్డారని అయినప్పటికీ పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించిందన్నారు. ముందుగా 9 మంది కార్గిల్ సైనికులను సి హెచ్ నాగరాజు, పీవీ సత్యనారాయణ, ఎస్ శ్రీనివాస్ పి వేణు ప్రసాద్, బి భూలోకం, జి రాంపండు, అబ్రహం రాజు, వి ప్రభాకర్, ఏం శ్యామ్ బాబు లను సత్కరించారు. అనంతరం అమర వీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు వబిలిశెట్టి రామకృష్ణ, ఆకుల లీలకృష్ణ, పేరిచర్ల సుభాష్, కాగిత సురేంద్ర, అరసవల్లి సుబ్రమణ్యం తో పాటు టీడీపీ జనసేన నేతలు పాల్గొన్నారు. కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్, కార్మూరి సత్యనారాయణ,అడ్డగర్ల ప్రభాకర్ గాంధీ, ఆడబాల శివ,కొప్పినీడి శ్రీను ముచ్చకర్ల సుబ్బారావు,రాట్నాల శ్రీనివాసరావు గన్నాబత్తుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *