సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఒక ప్రవేటు కాలజీలో చదువుతున్న కాలేజ్ విద్యార్థిని కుమారి అయితం ప్రణీత కి జరిగిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిది క్రింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు రూపాయలు మంజూరు చెయ్యడంతో .. . ఈ చెక్కు ను నేటి మంగళవారం రాత్రి భీమవరం గునుపూడి లోని శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంయుక్తంగా లబ్దిదారులకు అందచేశారు. ఈసందర్భంగా వారివురు మాట్లాడుతూ.. సీఎం జగన్ తమ విజ్ఞప్తి మేరకు సహృదయంతో సహకరించారని విద్యార్థిని ప్రణతి కి మంచి వైద్యం చేయించి న తరువాత మంచి చదువులు చదివించి అత్యున్నత స్థానానికి తీసుకురావాలని తల్లిదండ్రులకు సూచించారు. ఎందరికో జగనన్న వైద్యానికి అందిస్తున్న ఆర్ధిక సహకారం గానీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గానీ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకొని సీఎం జగన్ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *