సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో పొట్టి శ్రీరాములు మునిసిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు నేడు, సోమవారం జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు విద్యాకానుక కిట్ల లో భాగంగా పాఠ్య , నోటు పుస్తకాల బ్యాగులు ,ఇతర విద్యాసామాగ్రి , 3 జతల యూనిఫామ్ బట్టలు , షూస్, సాక్స్ పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శ్రీమతి పి.ప్రశాంతి, పారంభించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదువును మించిన ఆస్థి లేదని సీఎం జగన్ ఎప్పుడు చెపుతుంటారు.. అందుకే ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువులు ఉచితంగా చదవాలని.. దేశంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా ఎన్ని వేల కోట్లు ఖర్చయిన లెక్కచేయక నాడు- నేడు తో పాఠశాలల ఆధునీకరణ, విద్య సామాగ్రి తో విద్యాకానుక, అమ్మవడి, వసతి దీవెన, పెద్ద చదువులు చదివేందుకు ప్రోత్సహాలు తో సీఎం జగన్ పిల్లలకు సొంత మేనమామ ల ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులు చక్కగా చదువుకొని పెద్ద స్థాయిలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రమణ రావు , విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
