సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో నేడు, సోమవారం విద్యుత్ మీటర్ రీడర్స్ నాయకులతో కలిసి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు విద్యుత్ డిఇ కార్యలయం అధికారి డి.శ్రీనివాసరావుకు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ .. పాతికేళ్లుగా చాలీచాలని వేతనంతో బతుకుతున్న విద్యుత్ మీటర్ రీడర్స్ న్యాయమయిన డిమాండ్లను నెరవేర్చాలని, విద్యుత్ సిఎండి విజయానంద్ ఇచ్చిన ఉత్తర్వులను క్షేత్ర స్థాయిలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసారు. గతంలో సిఎండి మినిట్స్ లో పొందుపర్చిన అంశాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా వేతనాలు అందచేస్తామని, పన్నెండు రోజుల పని దినాలను అమలు చేస్తామని, పని భారం తగ్గిస్తామని, మీటర్ కమీషన్ రేటు పెంచుతామని మీటర్ రీడర్స్ కు సిఎండి ఇచ్చిన మినిట్స్ అమలులోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎఐటియుసి నాయకులు ఎం.సీతారాంప్రసాద్, అసోసియేషన్ జిల్లా కోశాధికారి కె.మల్లేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు పి.జాకబ్, తదితరులు పాల్గొన్నారు.
