సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ పరిధిలోని వేణుగోపాలస్వామి గుడి వద్ద ఒక వివాహిత మహిళపై స్థానిక పోలిశెట్టి హేమంత్ నేడు, బుధవారం బ్లేడు తో దాడి చేసి ఆమె గొంతు కోశాడు. ఈ దాడిలో మహిళకి గాయాలు కాగా పరుగులు తీసుకుంటూ తన తల్లి వద్దకు చేరుకుంది. దీంతో తల్లి మహిళని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ప్రాధమిక సమాచారం ప్రకారం కొంత కాలం ఉన్మాది చర్య కు పాల్బడిన హేమంత్ స్థానిక ఒక సిమెంట్ ఏజెన్సీ లో పనిచేస్తున్న వివాహితను వెంటపడి ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడని అతనికి కొద్దీ కాలం క్రితం పెళ్లి జరిగినప్పటికీ ఆమెను పెళ్లి చేసుకొందామని వేధిస్తూ ఆమె లొంగక పోవడంతో నేడు ఆమె ఇంటిలోకి దూరి గొడవ పెట్టుకొని ఒక బ్లేడు తో ఆమె ను మెడపై కొయ్యడం వెంటనే పరారీ కావడం జరిగిందని తెలుస్తుంది. ఆమెకు తీవ్ర రక్త స్రవరం జరగటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆపద నుండి కోలుకొందని తెలుస్తుంది. వన్ టౌన్ పోలీస్ లు కేసు నమోదు చేసుకొని పరారీ లో ఉన్న ఉన్మాది కోసం గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *