సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం శివారులో పెద అమిరంలో నేడు, బుధవారం మధ్యాహ్నం సీఎం, వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్య టించారు. స్థానిక కన్వెన్షన్ హాల్లో పాలకొల్లు వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు సుభాష్ వివాహానికి సీఎం హాజరయ్యా రు. వరుడు గుణ్ణం సుభాష్, వధువు దీప్తిలను సీఎం జగన్ ఆశ్వీరదించారు.ఈ వివాహ వేడుకలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మె ల్యే లు గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు, డిప్యూ టీ సీఎం కొట్టు సత్య నారాయణ, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వ రావు, ఎమ్మెల్యేలు పుప్పాల వాసు బాబు, రంగనాథరాజు తదితరులు జిల్లా వైసిపి నేతలు విశేషంగా పాల్గొన్నారు. భీమవరం విచ్చేసిన ముఖ్య మంత్రికి శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు మరియు వారి కుమారుడు సుందర్ రాజు హెలిప్యాడ్ వద్ద శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు.
