సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ ప్రజలకు మునిసిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో చేస్తున్న తాజా విజ్ఞప్తి ఏమిటంటే.. జాతీయ జంతు సంక్షేమ సంఘం, ఫరీదా బాద్, హర్యానా వారిచే గుర్తింపు పొంది వున్న ” స్నేహ వెల్ఫేర్ సొసైటీ” అనబడు స్వచ్ఛంద సంస్థ అధికారికంగా టెండర్ల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే 2024-25 కు గాను మన భీమవరం పట్టణ పరిధిలో ఉన్న వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మరియు రేబీస్ టీకాల కార్యక్రమాలు నిర్వహించుటకు అనుమతులు పొంది యున్నారు. స్థానిక అధికారుల పర్యవేక్షణలో, స్థానికంగా 17వ వార్డు నందు ఏర్పాటు చేసిన ఏ.బి.సి.సెంటర్ నందు నిపుణులైన పశువైద్యులచే వీధి కుక్కలకు కుటుంబనియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించి, అవి కోలుకున్న వారం తర్వాత మళ్లీ యథాస్థానంలో విడచి పెట్టుట జరుగును.కావున పుర ప్రజలు, జంతు ప్రేమికులు, స్వచ్చంద సంస్థలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అందరూ కూడా వారు వాహనంతో మీ వీధుల్లోకి వచ్చినపుడు కుక్కలను పట్టించుటలో పురపాలక సంఘం వారికి సదరు సంస్థకు చెందిన సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
