సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇస్లామిక్ ట్రస్ట్, వారు నేడు, సోమవారం స్థానిక వన్ టౌన్ లోని నిరాశ్రయులైన వృద్ధులను ఆదుకొంటున్న , ప్రేమాలయం వృద్దాశ్రమంలోని వృద్ధులకు పండ్లు (అరటిపండు, సీతాఫలక్కాయలు) మరియురొట్టెలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ సిద్దీఖ్ మాట్లాడుతూ… దైవ ప్రవక్త ముహమ్మద్ (స) వారు తీసుకువచ్చిన శాంతి మరియు మానవ సమానత్వ సందేశం కూడా అందరి కోసమని, తల్లిదండ్రుల పట్ల విధేయత, పరలోక చింతన, మానవ సమానత్వం, ఉత్తమ నైతిక జీవన విధానం, అందరి దేవుడు ఒక్కడే, మానవులంతా ఒక్కటే, సాటి మనుషుల పట్ల సత్ప్రవర్తన, మానవ సేవ అనేవి వారి ప్రధాన సందేశ అంశాలని తెలియజేసారు. వారిస్ఫూర్తిగా ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు యం.డి. మహబూబ్ పాషా, షేక్ ముజాహిద్, తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *