సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ :భీమవరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో నమోదు అయిన కేసు వివరాల ప్రకారం.. భీమవరం మండలం దెయ్యాలతిప్ప గ్రామానికి చెందిన పోతురాజు ఎలిజిబెత్ ఏటీఎం కార్డుకు కొత్తగా దరఖాస్తు చేసుకుంది. కొత్తగా వచ్చిన ఏటీఎం కార్డు పిన్ నిమిత్తం గొల్లవానితిప్పలోని బ్యాంకుకు ఈనెల 22వ తేదీన వెళ్ళింది. అక్కడ నుంచి భీమవరం బ్రాంచికి పంపించారు. ఆ బ్యాంకు ఎదుట ఉన్న ఓ అపరిచిత వ్యక్తి ఎలిజిబెత్ దగ్గరకు వచ్చి ఏటీఎం కార్డు తీసుకుని.. నేను ప్రయ్తత్నిస్తాను అంటూ.. ఓటీపీ తెలియని బాధితురాలి చేతిలోని ముబైల్ లో ఉన్న ఓటీపీ వివరాలు తీసుకున్నాడు. కాసేపు ట్రై చేసినట్లు నటించి తరువాత కార్డు పనిచేయడం లేదంటూ తిరిగి ఇచ్చేసి పక్కకు వెళ్ళిపోయాడు. ఏటీఎంలో నగదు తీయలేదు కదా అని ఇంటికెళ్ళిన ఎలిజిబెత్ శుక్రవారం భీమవరం పట్టణంలోని బ్యాంకుకు మళ్ళీ వచ్చింది. ఏటీఎం పిన్ ద్వారా పరిశీలిస్తే రూ.47 వేలు నగదును ఏలూరులోని ఆర్.లక్ష్మీ పేరున ఉన్న ఖాతాకు బదిలీ చేసినట్టు ఉంది. భీమవరం వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించగా సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
