సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో పలు వార్డులలో నూతన సిసి రోడ్ల నిర్మాణం, డ్రైన్స్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నా విషయం విదితమే..అయితే రెస్ట్ హౌస్ రోడ్డును లింక్ చేస్తూ.. ఎంతో మంది వ్యాపార ప్రముఖులు నివసిస్తున్నప్పటికీ దశాబ్దం పైగా కొత్త రోడ్డు నిర్మాణానికి నోచుకోని స్థానిక గంధం వెంకయ్య నాయుడు వారి వీధిలో తాజాగా నూతన సిసి రోడ్డు ను నిర్మించనున్నారు. దానికోసం ఇప్పటివరకు ఉన్న ఆక్రమణలు తొలగించి మరింత వెడల్పుగా రోడ్డు ను నిర్మించడానికి చక చక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆ రోడ్డుకు ఇరువైపులా మునిసిపల్ అధికారులు మార్క్ చేసి ఇళ్ళు భవనాల కట్టడాలు పొక్రేన్ సహకారంతో తొలగిస్తున్నారు. కొంతమంది భవన యజమానులు వారే స్వయంగా నిర్మాణాలు, గోడలు తొలగిస్తున్నారు. అయితే స్థానిక భవన యజమానులు కొందరు మావి ఆక్రమణలు కావని , పైగా మునిసిపల్ అధికారులు కొందరికి వెసులు బాటు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. భీమవరం పట్టణంలో మొదటి అపార్టుమెంట్ గా గత 3 దశాబ్దాలుగా క్రితం నిర్మించిన స్థానిక గంధం అపార్ట్మెంట్ చెందిన కాంపౌండ్ గోడలు గత సాయంత్రం అధికారులు తొలగించారు. ఇంకా అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫారమ్ ను కూడా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడంతో అపార్ట్ మెంట్ వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అది రోడ్డు ఆక్రమణ స్థలం కాదని, అయినప్పటికీ తొలగించి మార్చుకోవాలంటే 5 లక్షల పైగా అదనపు వ్యయం అవుతుందని( గోడలు నిర్మించడానికి ఖర్చు కలపకుండా) రోడ్డు కు ఇరువైపులా ఒకే రకమైన మార్కింగ్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి మునిసిపల్ కమిషనర్, వాస్తవాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించవలసి ఉంది.
