సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా భీమవరం పరిధిలోని అన్ని శివాలయాలు ‘ ఓం శివోహం’ అంటూ భక్త సంద్రం తో నిండిపోయాయి. దేవాలయంఫై అందమైన పుష్ప అలంకరణలుతో కన్నుల కైలాసం అద్భుతం తలపించే లైటింగ్ కాంతులతో, చలువ పందిళ్ళతో మెరిసిపోతున్న గునుపూడి పంచారామ క్షేత్రం లో చంద్ర ప్రతిష్ట శ్రీ సోమేశ్వరుని దర్శనం కోసం గత అర్ధరాత్రి నుండి భక్తులు భారీ క్యూ లైన్ లలో నిలబడి పోవడం జరిగింది. అయితే దర్శనాలు మాత్రం తెల్లవారు జాము 2న్నర గంటలకు ప్రారంభించారు. దేవాలయంఫై పుష్ప అలంకరణ అద్భుతంగ ఉంది శివరాత్రి కి భక్తులు కోసం దాతల సహకారంతో ప్రసాద వితరణ, మంచినీరు ఏర్పటు బాగుంది. ఆదివారం కూడా కావడంతో నేటి ఉదయం 11 గంటల వరకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గలేదు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటల నుండి 8గంటల వరుకు మాత్రేమే వీఐపీ లను అనుమతించడం క్యూ లైన్ లలో భక్తులకు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ప్రత్యేక క్యూ లైన్ ల ద్వారా వేగంగా భక్తులు శివదర్శనం చేసుకొంటున్నారు. పోలిసుల సహకారంతో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ బంగార్రాజు ఆధ్వర్యంలో కార్యనిర్వాహణ అధికారి డి రామకృష్ణంరాజు భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దూరప్రాంతాల నుండి వందలాది వాహనాలలో ఒకే రోజు 5 పంచారామ క్షేత్రాలు దర్శించుకొంటున్న భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. ఇక భీమవరం నడి బొడ్డున ఉన్న 1200 ఏళ్ళ పురాతన శ్రీ ఉమా భీమేశ్వర స్వామి దేవాలయం, మరియు మన సిగ్మా న్యూస్ ఆఫీస్ సమీపంలోని 160 ఏళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, యనమదుర్రు లోని స్వయం భువుడు శ్రీ శక్తేశ్వర స్వామి , దేవాలయాలలో కూడా ప్రత్యేక అభిషేకాలతో వేలాది భక్తులు శ్రీ స్వామివారి దర్శనం చేసుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *