సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ ఎన్నికల రిటర్న్నింగ్ అధికారికి పార్టీ బి ఫర్మ్ తో కూడిన నామినేషన్ పత్రాలను మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందజెయ్యడం జరిగింది. నేటి ఉదయం నుండి గ్రంధి శ్రీనివాస్ నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పండుగ వాతావరణం కనపడింది. వేలాదిగా వైసీపీ క్యాడర్ నేతలు తరలి వచ్చి ఆయనకు శుభాభినందనలు తెలిపారు. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి తో పాటు ప్రముఖ దేవాలయాలలో పూజలు నిర్వహించిన తదుపరి వేలాది కార్యకర్తలు నేతలు తో కలసి పీపీ రోడ్డు మీదుగా భారీ ర్యాలీగా నామినేషన్ వెయ్యడానికి ప్రజలకు అభివాదాలు చేసుకొంటూ బయలు దేరారు. ఆయన ఎన్నికల నిబంధనలు మేరకు స్థానిక మునిసిపల్ ఆఫీస్ వరకు కేవలం తనయులు రవి తేజ, సునీల్ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కామన నాగేశ్వర రావు లతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసారు. తదుపరి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ నవరత్నాలుతో ఎంతో సంక్షేమం భీమవరం ప్రజలకు అందిందని, ఆ పధకాలు కొనసాగింపుకు , భీమవరంలో జరుగుతున్నా అభివృద్ధి కొనసాగింపు కు మరోసారి ఎన్నికల బరిలో నిలిచానని , నా నామినేషన్ రోజునే ఇన్ని వేల మంది అభిమానంగా వచ్చి భారీ మెజారిటీ తో నా గెలుపు కు భరోసా ఇవ్వడం ఆనందంగా ఉందని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *