సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, సోమవారం రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషన్ రాజు జన్మదిన వేడుకలు పండుగ వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా ఆయన శ్రేయోభిలాషులు, వైసిపి అభిమానులు పట్టణంలో భారీ బాణాసంచా కాల్పులతో పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనం ( త్యాగరాజ భవనంలో ) మోషేను రాజు కు ఆర్యవైశ్య ప్రముఖులు వేదపండితుల మంత్రోచ్చారణ ఆసిర్వచనాల మధ్య , కేరళ తరహా డప్పుల వాయిద్యాల మధ్య మేళ తాళాలతో తలపాగా పెట్టి ఘనంగా పుష్ప మాలలతో సత్కరించారు. వారికీ మండలి చైర్మెన్ మోషన్ రాజు కృతజ్ఞలు తెలిపారు. భీమవరం ప్రజలతో తన అనుబంధం , వారికీ నా సేవలు ఎప్పడు కొనసాగుతాయని అన్నారు. రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ పాతపాటి సర్రాజు ముఖ్య అతిధిగా ..వక్తలు మాట్లాడుతూ.. భీమవరంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, వార్డు కౌన్సిలర్ గా పలుమారులు గెలచి, కాంగ్రెస్ జిల్లా ప్రసిడెంట్ గా..తదుపరి వైసిపిలో అంచెలు అంచెలుగా ఎదిగి ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతిష్టాకర పదవి అయిన పెద్దల సభ శాసనమండలికి చైర్మెన్ గా ఎదిగారని , అయినప్పటికీ ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే దానికి నిలువెత్తు నిదర్శనం మీరు… పదవులు, పార్టీలతో సంబంధం లేకుండా అందరి గౌరవం పొందే పొలిటిషన్…. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని… నిండు నూరేళ్లు ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఎప్పటికీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలని ఆ భగవంతుడు ని వేడుకుంటునాము అని ప్రశంసల వర్షం కురిపించారు. నేడు మరిన్ని కార్యక్రమాలలో రాష్ట్ర ప్రముఖులతో మోషేను రాజు పాల్గొనబోతున్నారు.
