సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వాడవాడలా అంగరంగ వైభవంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. లయన్స్ క్లబ్ తో సహా శ్రీ విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ . కాలేజీ, భారతీయ విద్యాభవన్ , వెస్ట్ బెర్రీ, శ్రీ వెంకటేశ్వర భధిర పాఠశాల వంటి విద్య సంస్థలు పలు స్వచ్చంధ సంస్థలు ఆధ్వర్యంలో విశేషంగా మహిళలు,విద్యార్థినులు. పాల్గొనగా ఎన్నో కార్యక్రమాలతో ఘనంగా మహిళా చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వెలది మంది మహిళలు విద్యార్థినులుతో 2కే రన్ భారీ ర్యాలీ ని జేపీ రోడ్డు లోని శ్రీ అల్లూరి సీతారామరాజు 35 అడుగుల కాంస్య విగ్రహం వరకు నిర్వహించారు. ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ .. గతంతో పోలిస్తే మహిళలు అన్ని రంగాలతో పురుషులతో సమానం గా అభివృద్ధి ని సాధిస్తున్నారని, మహిళలకు ఉన్నత విద్య, సమాజంలో గౌరవం పొందటం ఒక లక్ష్యంగా ఉండాలని, అయితే బాధ్యత యుతంగా కుటుంబ నిర్వహణలో భారతీయ మహిళాదే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నారని, అని, ప్రతి అమ్మాయి ఉన్నత విద్య ను సాధించి శాస్త్ర సాంకేతికే రంగాలలో ముందుండాలని, తమకు ప్రభుత్వాలు కల్పిస్తున్న పధకాలను, భరోసాలను, రక్షణ చట్టాలను మహిళలు చక్కగా ఉపయోగించుకొని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *