సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాడవాడలా శ్రీ వినాయక్ చవితి పందిళ్ళ నవరాత్రుల సందడి నేడు, శనివారం ఉదయం నుండి ప్రారంభమయింది. ఈ రోజు వరుణదేవుడు కూడా కరుణించడం తో ఉదయం 11 గంటలు దాటాక మంచి ముహూర్తం కావడంతో పందిళ్ళలోనూ ఎం అపార్ట్మెంట్స్ లోను పలు గృహాలలలో శ్రీ గణ నాధునికి కుడుములు ఉండరాళ్ళు, తో పలు రకాల ప్రసాదాలతో ప్రజలు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం నాచువారి సెంటర్ మెంటేవారి తోట, స్థానిక గన్నాబత్తుల వారి వీధిలోనూ పందిళ్ళలో 10 అడుగుల పైగా ఉన్న భారీ గణనాదుల విగ్రహాలు పెట్టారు. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము యొక్క ఉపాలయము అయినా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రుల మహోత్యవాలు ఎప్పటిలానే ఘనంగా భారీ పందిరితో లైటింగ్ అలంకరణలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు , ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్. వీరికి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు
