సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. గత సోమవారం సాయంత్రం నుండి రెస్టారెంట్స్, బేకరీలు , స్వీట్స్ షాపులలో కోలాహలం.. ఆయా షాపుల దగ్గర కేక్స్ , బిర్యానీలు , కూల్ డ్రింక్స్ ఆఫర్స్ వెలువ తో ఫ్లెక్సీ ల సందడి అలంకరణలు, పండ్లు, పూలబొకేల స్టాల్స్ ఏర్పాటు చేసారు. కొన్ని సంఘాలు,విద్య సంస్థలలో ఆధ్వర్యంలో గత రాత్రి సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అడ్మన్ నయీమ్ రష్మీ ఆదేశాలతో భీమవరంలోని కాదు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసులు సమర్ధవంతంగా అన్ని ప్రాంతాలలో పెట్రోలింగ్ చేస్తూ విధులు నిర్వహించారు. భీమవరంలో గతంతో పోలిస్తే మందుబాబుల కోలాహలం అర్ధరాత్రి హడావిడి బాగా తగ్గింది. కొత్త 2025 ను ఆహ్వానిస్తూ అర్ధరాత్రి బాణాసంచా కాల్పులు మాత్రం బాగా జరిగాయి. దేవాలయాలు తెరవలేదు. తెల్లవారు జాము నుండి దేవాలయాలలో భక్తులు సందడి పెరిగింది. నేడు, బుధవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహిం చుకునేవారు తప్పనిసరిగా సబ్ డివిజన్ పోలీసు అధికారుల నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోవలసి ఉంది. ఎప్పటి లానే రాజకీయాలకు దూరంగా ఉన్నపటికీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం వద్ద సందడి కి కొదవ లేదు. ఇక మెంటే పార్ధ సారధి, జనసేన చినబాబు నివాసాల వద్ద కోలాహలం కొనసాగింది. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో కలెక్టర్ నుండి కీలక అధికారులతో పాటు కేంద్ర మంత్రిగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత కీలక పదవులలో ఉన్న నేతలు ( శ్రీనివాసవర్మ, కొయ్యే మోషేను రాజు,రఘురామా కృష్ణంరాజు, పులపర్తి అంజిబాబు, రామరాజు, తదితరులు) నివాసాల వద్ద భారీ అభిమానులతో పాటు దూరప్రాంతాల నుండి పలువురు వీఐపీ ల రాకతో వారికీ పోలీస్ కాన్వాయిల భద్రతా ఏర్పాట్లు తో పట్టణం అంతటా సందడిగా ఉంది. VIP లఅందరి నివాసాల వద్ద ‘ఫుడ్ కి నేషనల్ బ్రాండ్ అయిన భీమవరం మార్క్ విందు’లకు కొదవ లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *