సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జనసేన పార్టీ విడుదల చేసిన ప్రకటనలో .. నేడు, ఆదివారం భీమవరం వైస్సార్సీపీపార్టీ 29 వార్డ్ ఇన్ ఛార్జ్ రాయవరపు శ్రీనివాసరావు వారి 50 మంది అనుచరు వర్గంతో భీమవరం నియోజవర్గం ఇంచార్జ్ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భముగా చినబాబు మాట్లాడుతూ.. భీమవరం పట్టణంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ రోజు రోజుకీ బలహీనపడుతుండగా.. జనసేన పార్టీ బలపడుతుంది అని రానున్న రోజుల్లో జనసేన పార్టీ లో మరిన్ని చేరికలు ఉంటాయని వైఎస్ఆర్సిపి పతనానికి ఇది నాంది అని అన్నారు. భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ .. జనసేన పార్టీ సిద్ధాంతాలు భావజాలం మరియు ప్రజా సమస్యల మీద చేస్తున్నపోరాటాలకి ఆకర్షితులై ప్రజలు జనసేన పార్టీ లో చేరడానికి ఇష్టపడుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రెటరీ సుంకర రవి, రామాయణం శ్రీను, తదితర జనసైనికులు, వీర మహిళలు,పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *