సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు స్థానిక 29వ వార్డులో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇంటింటా వైసీపీ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించి 2 ఓట్లు వైసీపీ అభ్యర్థులకే ఫ్యాను గుర్తుకు వెయ్యాలని కోరారు. ఈ ప్రచారంలో పలువురు మహిళలు ఆయనకు హారతులు ఇచ్చారు. స్థానిక మెంటేవారి తోటలో 2 రోజుల ప్రచారం కూడా పూర్తీ చేసారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం లోని లోక్ సభ వైసీపీ కార్యాలయంలో భీమవరం 21వ వార్డుకు చిన మసీద్ కి చెందిన ముస్లిం, ఇతర మైనారిటీ నాయకులు నేడు, శుక్రవారం గుంటి ప్రభువు ఆధ్వర్యంలో నరసాపురం వైఎస్సార్ ఎంపి అభ్యర్ధి గూడూరి ఉమాబాలను కలిసి మద్దతు తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు, మైనార్టీ లకు ఎస్సీ బిసి లకు పెద్ద పీట వేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కి మద్దతు ప్రకటిస్తున్నట్లు, ఎన్నికల్లో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎంపి అభ్యర్ధి ఉమాబాలను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఉమాబాల వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. . వైసిపిని గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని ఆమె కోరారు. అలానే గూడూరి ఉమాబాల, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారితో భీమవరం 1టౌన్ లో వడ్డెర సంఘ నాయకులు, పెద్దలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘ పెద్దలు ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
