సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఉదయం భీమవరం గునుపూడి లో దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 16 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ,YS రాజ శేఖర్ రెడ్డి భారీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగువారి గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత YS రాజ శేఖర్ రెడ్డి అని తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వాలు వచ్చిన ఆయన పేదల కోసం ప్రవేశపెట్టిన పధకాలు కొనసాగుతూనే ఉన్నాయి అంటే ఆయన సంకల్పం ఎంత గొప్పదో వచ్చే తరాలకు అర్ధం అవుతుందని కొయ్యే మోషేను రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో YSRCP భీమవరం నియోజకవర్గ ఇంచార్జ్ చినిమిల్లి వెంకట్రాయుడు గారు, YSRCP భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామ రాజు , A S రాజు, జల్లా కొండయ్య , నందమూరి ఆంజనేయులు ,బోకూరి విజయ రాజు, బలే యేసు బాబు తదితరులు,గునుపూడి యూత్ వారు పాల్గొన్నారు.
