సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు స్వర్ణాంధ్ర-స్వచ్ఛంధ్ర(SASA) కార్యక్రమం లో భాగంగా ప్రతినెల మూడవ శనివారం ఒక ప్రత్యేక ఇతివృత్తంతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా నేడు, శనివారం భీమవరం పురపాలక సంఘం పరిధిలో గల శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికల హైస్కూల్ నందు పురపాలక సంఘ కమిషనర్ ఆధ్వర్యంలో ” వ్యక్తిగత మరియు సామూహిక పరిశుభ్రత” ఇతివ్రతంగా స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథి గాహాజరు అయ్యి .. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత శుభ్రతను మరియు సామూహికంగా అతను పాటించవలసిన శుభ్రత కార్యక్రమాలను మరియు పాటించవలసిన జాగ్రత్తలను వివరించారు. వేదిక వద్ద ఏర్పాటుచేసిన అవగాహన స్టాల్స్ ని పరిశీలించి పురపాలక సంఘ సిబ్బందిని అభినందించడం జరిగినది. కమిషనర్ రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ..భీమవరం పట్టణమును స్వచ్ఛ భీమవరంగా తీర్చిదిద్దడానికి పాటుపడుతున్న పురపాలక సంఘ సిబ్బందికి మరియు పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలియజేసారు , ఈ కార్యక్రమంలో మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ అండ్ RDO ప్రవీణ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఏ రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ త్రినాథ రావు MHO సోమశేఖర్ , ఫుడ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర రెడ్డి మరియు వార్డు సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు మరియు మున్సిపల్ పాఠశాలల సిబ్బంది పాల్గొనడం జరిగింది.
