సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ట్రేడ్ లైసెన్సులు విపరీతంగా పెంపుదల చేశారని వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు. దీని నిమిత్తమై ఈరోజు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డీ ని చాంబర్ గవర్నింగ్ బాడీ సభ్యులు స్వయంగా సంప్రదించి ట్రేడ్ లైసెన్సులు పెంపుదల సమస్యను వారి దృష్టికి తేవడం జరిగినది. దానికి వారు దానికి సమస్యను పునః పరిశీలిస్తామని తెలియజేశారు. దీనిపై పట్టణంలోని వ్యాపారస్తులు ఎవరును ఆందోళన చెందనవసరము లేదు. ముందుగా ఛాంబర్ అనుబంధ సంఘముల వారు వారి వారి సభ్యులతో సమావేశము జరుపుకొని ఎవరెవరికి ట్రేడ్ లైసెన్సులు ఎంత పెంపుదల జరిగినదో వారి వ్యాపారలెటర్ హెడ్ పై వ్రాసి దానికి మునిసిపాలిటీ వారు ఇచ్చిన నోటీసును జతచేసి చాంబర్ ఆఫ్ కామర్స్ కు రెండు మూడు రోజుల్లోఅందజేసియాలని, దీనిపై చాంబర్ ఆఫ్ కామర్స్ తదుపరి కార్యాచరణ నిమిత్తం నిర్ణయము తీసుకొంటామని చాంబర్ ఆఫ్ కామర్స్ఉపాధ్యక్షులు, తుమ్మలపల్లి నాగ వెంకట శివ సత్యకృష్ణ మూర్తి (శివ) తాజగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
