సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లూథరన్ హైస్కూల్ గ్రౌండ్ లో శంకర హ్యుండ్ లూమ్స్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్స్ ఫన్ పెయిర్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. స్థానిక ప్రజలతో పాటు దూరప్రాంతాల నుండి వచ్చే బందు మిత్రులకు అదనపు బోనస్ గా సంక్రాంతి వేడుకల్లో ఆహ్లాదం కోసం ఎటువంటి ఎగ్జిబిషన్లు మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలు వీరిని పోత్సహించి ఆహ్లాదం పొందాలన్నారు. నిర్వాహకులు షేక్ అలిషా మాట్లాడుతూ.. అన్ని ఆధునిక హంగులతో పెద్ద నగరాల స్థాయిలో లండన్ వంతెన ,భారీ సిటీ ఆకృతులతో సెట్స్ వేసి, ఆబాల గోపాలన్నీ ఉల్లాసపరిచే ఫన్ రైడ్స్ తో, అనేక రాష్ట్రాల విభిన్న వస్తువులు దుస్తులు, ఫ్యాన్సీ ఐటమ్స్ అందుబాటు ధ్రలో షాపింగ్ చేసుకోవచ్చునని 40 రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని ప్రజలు దూరప్రాంతాల నుండి వచ్చే వారు , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు పాల్గొనారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *