సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత శనివారం సాయంత్రం ఆస్పత్రి నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని, ముఖ్యంగా ఈ ఆసుపత్రి నిర్మాణానికి కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చి సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. వంద పడకల హాస్పిటల్ ఉంటే అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారని, అత్యాధునిక వైద్య పరికరాలు కూడా సమకూర్చుకోడానికి అవకాశం ఉంటుందని అన్నారు. భీమవరం జిల్లా కేంద్రమైన నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు ఈ ఆస్పత్రి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. కృష్ణాజిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలకు కూడా ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందని తెలిపారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారుగా 3 వేల500 కు పైగానే వ్యాధులకు ఉచిత వైద్యాన్ని మన రాష్ట్రంలోని ఎంపిక చేసిన కార్పొరేట్ ఆసుపత్రులతో పాటుగా ఇతర రాష్ట్రాలలో కూడా ఎంపిక చేసిన కార్పొరేట్ ఆసుపత్రులలో అందిస్తున్న ఘనత దేశంలో మన సీఎం జగన్ కి మాత్రమే దక్కిందని అన్నారు. అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు ఆసుపత్రులకు పెద్ద ఎత్తున బకాయిలను పెట్టారని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బకాయిలను కూడా పూర్తిస్థాయిలో చెల్లించారన్నారు.
